VB-G RAM G Bill : వీజీ జీ రామ్‌జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

TRINETHRAM NEWS

Trinethram News : మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ గ్రామ్ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ సంకల్పించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్‌(గ్రామిన్) బిల్లుపై ఆదివారం ముర్ము సంతకం చేశారు. దాంతో.. దాంతో.. దాదాపు ఇరవై ఏళ్లుగా కరువు పనిగా కొనసాగుతున్న ఎంజీనరేగా (MGNAREGA) చట్టం కనుమరుగవ్వనుంది.

వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పలు సంస్కరణలకు రూపమిస్తున్న మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొత్త పేరుతో కొనసాగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 100 రోజులు ఉపాధి కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే.. మోడీ ప్రభుత్వం ఈ పథకం నుంచి గాంధీ పేరున తొలగించాలనే ఉద్దేశంతో కొత్త చట్టంతో వస్తోంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్‌(గ్రామిన్) బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం. ఆదివారం ఆ బిల్లుపై ప్రెసిడెంట్ సంతకం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

President approves VG Ramji Bill

You cannot copy content of this page

Scroll to Top