ఆగస్ట్ 5, 2026
TRINETHRAM NEWS
Newborns Fed Colostrum

Newborns Fed Colostrum : డుంబ్రిగూడ, ఆగస్టు 6,(త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ కొర్రాయి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు జాతరవలస అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అంగన్వాడీ కార్యకర్తలు కె. మల్లమ్మ, కొండమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డకు పుట్టిన వెంటనే తల్లిపాలలో వచ్చే ముర్రిపాలు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. ముర్రిపాలు శిశువుకు ఎంతో మేలు చేస్తాయని, తల్లులు ఆకుకూరలు, కాయగూరలు తదితర పోషకాహారాన్ని తీసుకోవాలని అవగాహన కల్పించారు.

బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత ఆరోగ్యం పరిశుభ్రత తల్లి బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలపై వివరించారు ముర్రిపాలు కొలస్ట్రామ్ ఎంతో పోషక విలువలు కలిగి ఉంటాయని ముర్రి పాలు సాధారణ పాలకు మధ్య ఉన్న తేడాలను బాలింతలకు వివరించి తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు. జి.అప్పర్ణ. కె.ప్రమీల. రంభ. ధనలక్ష్మి. కళావతి. రంభ. చిన్ని. బాలింతలు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page