ఆగస్ట్ 5, 2026
TRINETHRAM NEWS
Balavarigudem Path Development

Balavarigudem Path Development : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 05 ; చింతలపూడి పట్టణం, గాంధీ బొమ్మ సెంటర్ నుంచి బలవారిగూడెం రోడ్ వరకు రూ.2.51 కోట్ల వ్యయంతో 4.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ భూమి పూజ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఆయన అక్కడికి చేరుకోగానే యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున జై రోషన్ . జై జై రోషన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, టపాసులు పేలుస్తూ, శాసనసభ్యులను తమ భుజాలపై మోసుకుంటూ అపూర్వమైన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం శాసనసభ్యులు జేసీబీపైకి ఎక్కి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు అంబరాన్ని అంటేలాగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గ్రామస్థులు మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రత్యేక కృషి వల్లే సాధ్యమైందని, ఇందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, భవిష్యత్తులో కూడా ఆయనే తమ ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, అభిమానులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page