
Mahesh Babu Nephew : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ : స్పెషల్ అట్రాక్షన్ అయిన మహేష్ అన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది.
అయితే ఈ ఫోటోలలో మహేష్ బాబు సతీమణి నమ్రతతోపాటు మహేష్ అక్కలు, అలాగే ఆయన అన్న రమేష్ బాబు కూతురు భారతి సైతం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోటోలలో భారతి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మహేష్ సోదరి పద్మావతి -బావ గల్లా జయదేవ్ కు ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దబ్బాయి అశోక్ ఇప్పటికే తెలుగులో హీరోగా రాణిస్తున్నాడు.
ప్రస్తుతం అతడు విసా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక చిన్న కోడుకు సిద్ధార్థ్ ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాంటిది.. ప్రస్తుతం కొరియన్ కు చెందిన హాయిన్ / జిన్నీ అమ్మాయితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాల సమక్షంలో ఆదివారం ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ వేడుకలలో మహేష్ బాబు ఫ్యామిలీ, బందువులు అంతా ఎంగేజ్మెంట్ వేడుకలలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. భారీ బడ్జెట్ మధ్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe