Congress Party Coordinator : వినాయక మండపానికి 10,000/- వేల విలువ గల రేకులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్

TRINETHRAM NEWS

అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆకెనపల్లి గ్రామంలో గొల్లవాడకు సంబంధించిన వినాయక విగ్రహ మంటపానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కో ఆర్డినేటర్ గాదె సుధాకర్ చిన్నారి హవిజ్ఞ జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు గ్రామ ప్రముఖుల సమక్షంలో రేకులు అందజేయడం జరిగినది. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ వినాయక మంట పాల ఏర్పాటు వల్ల నవరాత్రోత్సవాల వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతున్నదని, యువతతో పాటు ప్రజలంతా సన్మార్గంలో నడవడానికి మార్గం సుగమం అవుతున్నదని, మానవ జన్మకు ఆధ్యాత్మికత ఆలోచనలే సార్థకతను చేకూరుస్తాయని ఆ వినాయకుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేకులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని ఇంత మంచి కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని మాట్లాడడం జరిగినది.

ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షులు మర్రి రాజ్ కుమార్,మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు సామల శ్రీనివాస్,బీసీ సెల్ అధ్యక్షులు గెల్లు కుమార్, మెండే మధు,గుడికందుల గురువయ్య,గెల్లు కుమార్,గెల్లు కుమార్(చేరాలు),మెండే రమేష్ (లడ్డు బాబు), మెండే మల్లయ్య, శ్రీరాముల సత్తయ్య,బొద్దుల రవి,బొద్దుల శ్రీనివాస్,మెండే కిష్టయ్య, మెండే లక్ష్మణ్,గంగాధరి గణేష్,గుర్రాల సజన్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress Party Coordinator Gade Sudhakar

You cannot copy content of this page

Scroll to Top