ఆగస్ట్ 5, 2026
TRINETHRAM NEWS
Minister Kinjarapu Atchannaidu

Minister Atchannaidu : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 05 ; రాష్ట్రంలో పొగాకు రైతుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలపై ఆధారపడినవని, రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బహిరంగ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేట్ హోట‌ల్ లో మీడియాతో మాట్లాడుతూ , జగన్ మీరు పొగాకు రైతుల కష్టాల గురించి మాట్లాడుతున్నారు కానీ బహిరంగ చర్చకు రావడం లేదు అని అన్నారు.

రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈ సవాలును సేకరించాలి అని తెలిపారు.పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ వాళ్లను ఆదుకున్నది టీడీపీ నాయకత్వంలోని ప్రభుత్వమే అని గుర్తు చేశారు.రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారీ అండగా నిలిచి నిర్ణయాలు తీసుకున్న చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. గత సంవత్సరం బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి, సుమారు రూ.280 కోట్లు వెచ్చించడం జరిగింది.

2014–15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు, వాణిజ్య పంట అయినప్పటికీ రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతి కిలోకు రూ.20 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చరిత్రలోనే ఇది ఒక కీలక నిర్ణయం. అయితే, మీ ప్రభుత్వ హయాంలో 2019లో సుమారు 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, ధర కిలోకు రూ.121–123కు పడిపోయింది. అయినప్పటికీ మీ ప్రభుత్వం కేవలం 11.8 మిలియన్ కిలోలను మాత్రమే కొనుగోలు చేసి, మిగిలిన రైతులను గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. తదుపరి సంవత్సరం సుమారు 128 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయి, ధర కిలోకు రూ.123కు పడిపోయినప్పటికీ, మీ ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు అని సూచించారు. రైతులకు ఎలాంటి అదనపు ఆర్థిక సహాయమూ అందించలేదు అని వేద్దేవా చేశారు.

పొగాకు ధరల విషయంలో కూడా వాస్తవాలు ప్రజల ముందున్నాయి అని పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరం టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారు. అధిక ఉత్పత్తితో ఇబ్బందులు ఎదురైన రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం వెంటనే ముందుకొచ్చింది. సుమారు 100 మిలియన్ కిలోల పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ఈ సహాయం పంపిణీని తక్షణమే ప్రారంభిస్తున్నాం అని అన్నారు. అంతేకాదు అంచనాకు మించి పొగాకు వచ్చినా, దానికి కూడా ప్రతి కిలోకు రూ.10 చొప్పున సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతోపాటు, కేంద్ర ప్రభుత్వం ప్రతి పొగాకు బ్యారన్‌కు రూ.50,000 వడ్డీలేని రుణం అందిస్తోంది. ఈ వాస్తవాలన్నింటి తర్వాత కూడా పొగాకు రైతుల గురించి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్‌మోహన్‌రెడ్డికి లేదు అని ఆయనపై గర్జించారు. గ‌త‌ ప్రభుత్వ పనితీరు, కూటమి ప్రభుత్వ సహాయంపై గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని ,మరోసారి సవాలు చేస్తున్నాం అని తెలిపారు. రైతులు గత ప్రభుత్వ పనితీరును, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పోల్చి చూడండి. ఎవరు రైతులను గాలికి వదిలేశారో, ఎవరు కష్టకాలంలో అండగా నిలిచారో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
2019 వ సంవత్సరంలో కేజీ పొగాకు రూ. 142, అదేవిధంగా 2020 లో రూ. 140, 2021 లో రూ. 161, 2022 లో రూ.192, మరియు 2023 లో రూ.248, 2024 కూటమి ప్రభుత్వ హాయంలో రూ.326, 2025 లో రూ .300, ఇవన్నీ పొగాకు ధరల విషయంలో కూడా వాస్తవాలు ప్రజల ముందు ఉన్నాయని స్పష్టంగా వివరించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page