
Nara Lokesh : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూలై 27; మంగళగిరి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు , విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థిని శివాని మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈనెల అనగా జులై 24 వ తేదీన పోలవరం జిల్లా, రంపచోడవరం లో జరిగినటువంటి మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన శివాని మృతి తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆ విద్యార్థిని మాట్లాడిన మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe