Educate Students : విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 05/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గం ల కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, లో ఉన్న గ్రామాలు సీతంపేట, బయ్యనగూడెం, శోభనాద్రిపురం, కేతవరం, రాజవరం, మంగపర్తి దేవిపాలెం, గంగవరం, యర్రం పేట కన్నాయిగూడెం కన్నాయ గూడెం, బోడిగూడెం , మంగపతి దేవి పేట మంగపతి దేవి పేట, ప్రధానోపాధ్యాయులు కె. విశ్వేశ్వరరావు, ఎ. అన్నపూర్ణేశ్వరరావు, కె. సత్యనారాయణ, డి. నారాయణ, కె.. పోసి రత్నం, పి. ఇందిరా, పి. రమేష్, పి. వెంకటేశ్వరరావు, మోహన్, కె. జయ, యం.వి. రాజరిషి, పి. సుధీశ్వర రావు, ఇంటర్వ్యూలో భాగంగా విద్యార్థులకు సంబంధించి తగిన వివరణ అందించారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన పట్టిక ప్రకారం ప్రతిరోజు సన్న బియ్యంతో కూడిన అన్నము, కూరగాయలు, ఆకుకూరలు, గ్రుడ్లు, రోజు విడిచి రోజు రాగి జావా, వేరుశనగ మరియు బెల్లం తో తయారు చేసినటువంటి చిక్కీలు తో కూడిన మంచి పౌష్టిక ఆహారాన్ని పెడుతున్నామని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర భాగంగా విద్యార్థులకు సంబంధిత సామాగ్రి ని అందించమని పేర్కొన్నారు. ప్రభుత్వ సమయం ప్రకారం ప్రతిరోజు పాఠశాలలు తెరుస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటలు కూడా ఆడిస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు సంబంధించి హాజరు శాతాన్ని బట్టి వాళ్ల తల్లుల బ్యాంకు ఖాతాలో తల్లికి వందనం రూపాయలు పడ్డాయని తెలిపారు. మండల పరిషత్ , ప్రభుత్వ ప్రాథమిక మోడ్రన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మరియు కొత్తగా ఎంతమంది విద్యార్థులు జాయినింగ్ అయ్యారో సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు మరియు వాళ్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

mission is to educate students

You cannot copy content of this page

Scroll to Top