
Compensation for Farmers : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ;వేలేరుపాడు మండలం, చిగురుమామిడి, నార్లవరం గ్రామాలకు చెందిన మిర్చి రైతులు గత సంవత్సరం అగ్రి జెనటిక్స్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు సాగు చేసి నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు చొరవ తీసుకున్నారు.
ఈ క్రమంలో 29 మంది రైతులకు చెందిన 47 ఎకరాల మిర్చి పంటకు సంబంధించి సుమారు రూ.14 లక్షల నష్టపరిహారాన్ని, కంపెనీ సహకారంతో ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత బాధిత రైతులకు చెక్కుల రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రైతులు నష్టపోయిన సమయంలో అండగా నిలిచి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి గంగాధరం, కూటమి నాయకులు మేచినేని సంజయ్, శివరాం, భాను తదితరులు పాల్గొన్నారు.

మీ పూజా గదికి దైవికమైన కాంతిని మరియు సాంప్రదాయక అందాన్ని ఇచ్చే ఇత్తడి దీపాలు!