ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Minister Atchannaidu

Minister Atchannaidu : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 27; బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం: మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. అని అన్నారు. ఉత్తరాంధ్ర తీరంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి వెల్లడించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని సూచించారు. సముద్రం మాకేమీ కొత్త కాదు అనే ధీమాతో వేటకు వెళ్లొద్దు, ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి అని స్పష్టం చేశారు. వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలి కోరారు.
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి , అధికారుల సూచనలు తప్పక పాటించాలి అని పేర్కొన్నారు. ప్రాణరక్షణకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సముద్రంలోకి వెళ్లే ముందు పడవల్లోని ట్రాన్స్‌పాండర్లు, కమ్యూనికేషన్ పరికరాలు పనిచేస్తున్నాయో తనిఖీ చేసుకోవాలి: ఆయన అన్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page