Mega Parents Meeting : మెగా పేరెంట్స్ మీటింగ్ తో విద్యార్థుల భవితకు బంగారు బాటలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( చింతపల్లి ) నియోజకవర్గఇంచార్జ్ : అల్లూరిజిల్లా, చింతపల్లి మండలం, లంబసింగి గర్ల్స్ హై స్కూల్ మెగా తల్లి దండ్రుల – ఉపద్యాయుల సమావేశం,- 2.0 కార్యక్రమం లో స్కూల్ చైర్మన్, సుర్ల అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా అత్యుత్తమ చదువులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలిఅన్నారు.

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మెగా పేరెంట్స్ మరియు ఉపాధ్యాయులు సమావేశానికి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ విద్యార్థులలో నైపుణ్యం పెంచడానికి, సృజనాత్మకత పెంచడానికి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి, ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజన పథకం ఏర్పాటు చేస్తూ, సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద విద్యార్థులకు కిట్లు పంపిణీ, పరీక్షలలో ఉత్తమమైన ఫలితాలు కనబరిచిన వారికి గుర్తించి సైనింగ్ స్టార్స్ అవార్డులు పేరిట సత్కరించడం, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడమేనని కొనియాడారు.

అలాగునే తల్లి దండ్రులు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలతో ఇంటి దగ్గర చదువుతో పాటు, మంచి ప్రవర్తన, పెద్దలయందు గౌరవ, మర్యాదలు నేర్పించాలి. తల్లి దండ్రుల పాత్ర ఎంతో కీలక మైనది. నేటి పిల్లలే రేపటి పౌరులు అని, మరియు రేపటి భవిష్యత్తులో పిల్లలు ఉన్నత మైన శిఖరాలను చేరుకోవాలని అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Golden Paths for Students'

You cannot copy content of this page

Scroll to Top