సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Assurance fishing families

Assurance Fishing Families : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్‌ 26 ; రాష్ట్రంలో తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో వేటే జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ప్రతికూల వాతావరణంతో ఉపాధికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఆయా కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారని అన్నారు. ఆపద సమయంలో బాధితులకు సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లాల యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో అర్హులైన మత్స్యకార కుటుంబాలన్నింటికీ ఈ సహాయం అందుతుందని స్పష్టం చేశారు. వేట నిలిచిపోయిన వేళ వారి కుటుంబాల ఆహార అవసరాలకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు.

వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వాళ్ల ప్రాణ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పారాదీప్‌కు సురక్షితంగా చేరిన కాకినాడ మత్స్యకారుల పడవ కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్‌ పడవ శనివారం ఉదయం ఒడిశాలోని పారాదీప్‌కు సురక్షితంగా చేరుకున్నట్లు తెలిపారు. పడవలో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మత్స్యకారులు తమ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆయన విజ్ఞప్తి చేశారు.

Version 1.0.0

మీ ఇంటి గోడలకు సరికొత్త అందాన్ని మరియు ప్రశాంతతను ఇచ్చే మోడ్రన్ వాల్ ఫిష్ బౌల్!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page