సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Please arrange bus service

Please Arrange Bus Service : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ;తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలో ఉన్న విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేశారు.గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థవారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అత్తోట పోతురాజు మాట్లాడుతూ కొలనుకొండ,వడ్డేశ్వరం గ్రామాల నుండి నిత్యం చాలా మంది జీవనోపాధి కొరకు, పిల్లలు ఇంటర్, డిగ్రీ , ఇంజనీరింగ్, లాంటి చదువుల కోసం విజయవాడ, మంగళగిరి, గుంటూరు తదితర పట్టణాలకు వెళ్తుంటారు అని అన్నారు.

అయితే బైపాస్ రోడ్డు వద్ద దిగితే గ్రామంలోకి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఉదయం 2 ట్రిప్పులు, సాయంత్రం 2ట్రిప్పులు కొలనుకొండ, వడ్డేశ్వరం, ప్రక్కన ఉన్న ఇప్పటం గ్రామాలు కలుపుతూ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. దాని వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ . పిచ్చయ్య మంగళగిరి డిపో మేనేజర్ కి వినతి పత్రం అందించారు..47 బస్సులు కొలనుకొండ, వడ్డేశ్వరం, మీదుగా వెళ్ళే అవకాశం ఉంటుందేమో విజయవాడ డిపో 1 మేనేజర్ తో ఒకసారి మాట్లాడతాను అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో, గుడ్ షెఫర్డ్ సంస్థ సిబ్బంది అత్తోట పోతురాజు ఆ గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటి సభ్యులు నెమలకంటి విజయనిర్మల,గుంపా మరియమ్మ,శిఖా తెరోజిమ్మ,తురక ఎలియ గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Version 1.0.0

మీ మ్యూజిక్ మరియు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లే పవర్‌ఫుల్ బడ్జెట్ ఇయర్‌బడ్స్!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page