
Gudivada Prakash Rao : అరకులోయ జూలై 8, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం చొంపి పంచాయితీ పరిధిలోని కొత్తవలస బూత్, పప్పుడువలస గ్రామంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకువ్యాలీ మండల ఉపాధ్యక్షులు గుడివాడ ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు)తో సమావేశమై ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై పలు సూచనలు చేశారు.
ఓటరు జాబితా సవరణను ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యం లేదా వివక్షకు తావులేకుండా బీఎల్వోలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు.”ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే బలం” కాబట్టి
ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితాకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఆ హక్కు కల్పించడం ఎన్నికల యంత్రాంగం బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను స్వయంగా నింపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్వో, మరియు గ్రామస్థులు పాల్గొని ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు సహకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe