జూలై 14, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

–దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

MLA Balu Naik : డిండి (గుండ్ల పల్లి) జులై 07, త్రినేత్రం న్యూస్. ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై డిండి మండలం గుండ్లపల్లి లో నిర్వహించిన మండల బీ ఎల్ ఏ లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సు”లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడారు, భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ పూర్తిగా అర్థం చేసుకుని, అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ఓటు లేకపోతే వ్యక్తి తన ప్రజాస్వామ్య హక్కును కోల్పోవడమే కాకుండా సమాజ అభివృద్ధిలో తన పాత్రను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అవసరమైన దరఖాస్తులు, పత్రాల సమర్పణ, అభ్యంతరాల నమోదు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ప్రజలకు సహాయం చేయాలని, పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండాలని కోరారు.

ఈ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో అత్యంత వేగవంతంగా ఓట్లను ఆన్లైన్ చేస్తున్న బీ ఎల్ ఏ లను వేదికపై దేవరకొండ ఎమ్మెల్యే , డీసీసీ అధ్యక్షులు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల శశిధర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, ఎస్ ఐ ఆర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్ నాయక్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డమీది సాయి, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page