YSR Congress Party : కష్టం వేస్తే అండగా ఉంటా

TRINETHRAM NEWS

కార్యకర్తలే పార్టీకి బలం….

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత రౌండ్ టేబుల్ సమావేశం….

త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 4, మండపేట, కష్టం వేస్తే వారికి అండగా ఉంటానని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసీపీ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండపేట పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో మంగళ వారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అబ్జర్వర్లుగా కానుమూరి సునీల్, వై. నాగార్జున యాదవ్, అసెంబ్లీ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. వచ్చేది వైఎస్సార్ ప్రభుత్వమని జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని పేర్కొన్నారు.పార్టీ బలోపేతం, రానున్న రోజుల్లో విజయపథంపై నడవడానికి తీసుకోవాల్సిన విధానాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. సలహాలు, సూచనలు సేకరించారు.

గ్రామ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకాలపై ప్రత్యేక చర్చ జరిగింది.తోట త్రిమూర్తులు నియోజకవర్గంలో ఉండటం పార్టీకి, నియోజకవర్గానికి ఎంతగానో దోహదపడుతుందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. పార్టీలో పదవులు పొందిన వారందరూ పూర్తి స్థాయిలో పార్టీ విజయానికి కృషి చేయాలని వక్తలు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు తదితరులతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల ప్రతినిధులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, వార్డు, గ్రామ పార్టీ ఇన్చార్జులు, వైస్ చైర్మన్, సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

If they work hard, they will support them

You cannot copy content of this page

Scroll to Top