
Brahmotsavam : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; తిరుమల లో వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆరవ రోజు సందర్భంగా మల్లయప్ప స్వామి కోదండ రాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు .మాడ వీధుల్లో ఆయన విహరించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అక్కడ 31 కంపార్టు మెంట్లు నిండాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. ఆ స్వామిని 83,589 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూపాయలు 4.17 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe