
Irregularities Liquor Policy : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22; నూజివీడు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం హాయంలోనే మద్యం విధానంలో చాలా అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కల్తీ మద్యం ఘటనలకు ఆ పార్టీ అధినేత జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీ పై లేనిపోని నిందలు వేస్తూ , అక్రమాలు జరిగాయి అంటూ వైసీపీ వాళ్లు బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. దీనిపై గంటల కొద్ది మాట్లాడుతున్న జగన్ మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. గత ప్రభుత్వం వైసిపి హాయంలోనే మద్యం విధానంలో రూపాయలు 3,200 కోట్ల అక్రమాలు జరిగాయని విమర్శించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe