ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
ITDA PO Aditya Varma

ITDA PO Aditya Varma : అనంతగిరి జులై 8, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని 284, 285 పోలింగ్ కేంద్రాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నమోదు, జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి, బీఎల్ఓల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలను ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో త్వరగా సేకరించి, నిర్ణీత గడువులోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. వీరభద్రాచారి, సూపర్వైజర్ ఎం. వినోద్ కుమార్, బీఎల్ఓలు కుసుమ, దేముడు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page