Arakuvelly News : మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థాయికి ఎదగండి

TRINETHRAM NEWS

అరకులోయ నవంబర్ 19, (త్రినేత్రం న్యూస్): అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. హిమగిరి ఆధ్వర్యంలో అరకు వేలి మండలం కొత్త బలుగూడ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హై స్కూల్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు పంపే అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లకు లోనవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ర్యాగింగ్, మత్తు పదార్థాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యసాధనకు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఏ సమస్య వచ్చినా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
స్థానిక ఎస్ఐ జి. గోపాలరావు మాట్లాడుతూ మండలంలో ప్రత్యేక పోలీస్‌ టీం నిత్యం పర్యవేక్షణ చేస్తోందని, విద్యార్థులు మంచి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. స్కూల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Walk on the right path and rise to the to

You cannot copy content of this page

Scroll to Top