- ఎస్ కెవీటిలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన
- రూ. 5 కోట్లు మంజూరు
త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం : విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు ఎస్కెవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 5 కోట్లతో చేపట్టనున్న 12 నూతన తరగతి గదుల నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్… ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సామాన్య విద్యార్థుల ఉన్నతికి దోహదపడతాయన్నారు. ఈ నూతన తరగతి గదులు విద్యార్థుల చదువుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, వారి కలలకు బలమైన పునాదిగా నిలుస్తాయన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో ముందుకు సాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి అంకిత భావాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఎప్పటినుండో పెండింగ్ ఉన్న 13 లక్షల రూపాయల అధ్యాపకుల జీతభత్యాలను కూడా వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నత అధికారులను, ట్రస్ట్ బోర్డ్ వారికి సూచించారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నూతన విద్యా విధానం ద్వారా విద్యలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. విద్యపై పెట్టుబడి పెట్టడం అంటే సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే అని అన్నారు. నాణ్యమైన విద్యే దేశ అభివృద్ధికి అసలైన ఇంధనం” అని పేర్కొన్నారు. అధ్యాపకులు విద్యార్థుల్లో విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా బోధన చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ మహిళలు, పేద, గ్రామీణ నేపథ్య విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలే పెద్ద ఆధారం అని అన్నారు. మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, సమాన అవకాశాలు కలిసినప్పుడే విద్యా వ్యవస్థ బలపడుతుంది” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వి తిరుపణ్యం, జీ శరత్, డాక్టర్ డివి రమణమూర్తి, డాక్టర్ వై స్వర్ణ శ్రీ, డాక్టర్ పి వి బి సంజీవరావు, బిహెచ్వివి మూర్తి, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


