తేదీ : 12/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం లో ఘనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవడంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూటమి నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. మండల టిడిపి అధ్యక్షులు ఏలూరి. హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆయా గ్రామాల నుండి టిడిపి, జనసేన, బిజెపి అధ్యక్షులు మరియు కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందించారని చెప్పడం జరిగింది. మరికొన్ని పథకాలు సమయం సందర్భం చూసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు సుధీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


