సెప్టెంబర్ 5, 2026
TRINETHRAM NEWS
80th Independence Day Celebrations

ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

80th Independence Day : త్రినేత్రం న్యూస్ : ఆగస్ట్ 15, జేగురుపాడు గ్రామంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్న వివక్షతలను రూపుమాపడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ తమ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఆకుల సుధాకర్, నాగిరెడ్డి మోహన్, బళ్ల అన్నవరం, మోటుక మునియ్య, బుడ్డిగ లక్ష్మణరావు, బచ్చల యేసయ్య, వారా శరత్, వరసాల రత్నబాబు, రాయి మోహన్, తాలాభత్తుల వెంకటరత్నం, బళ్ల చిన్ని, మద్దుకూరి పుల్లయ్య, మగ్గం వెంకన్న, మారే శ్రీను, ముంగమూరి జీవరత్నం, నల్లి చిన సూర్యారావు, బాణాల నాని, ముంగమూరి నాంచారి, యాళ్ల బ్రహ్మానందం తదితరులతో పాటు స్థానిక మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి నినాదాలు చేశారు. గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page