MLA Bandaru Satyananda Rao : పల్లెల్లో వైద్య ఆరోగ్య సేవల పెంపుదలకు కృషి

TRINETHRAM NEWS

రూ.1.80 కోట్లతో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన…

ఆలమూరు మండలంలో పలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

త్రినేత్రం న్యూస్, కూటమి అధికారంలోకి వచ్చాక పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేమితో ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొనే వారని, కూటమి అధికారంలోకి వచ్చాక రహదారులు, డ్రైనేజీలు మొదలైన సదుపాయాలు కల్పన వేగంగా, జరుగుతుందన్నారు.

తాజాగా గ్రామాల్లో వైద్యారోగ్య సేవలు మెరుగుదలకు, అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారు తెలియజేశారు. గురువారం ఆలమూరు మండలంలో నర్సిపూడి, పెనికేరు, కలవచర్ల, పినపళ్ళ, చింతలూరు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.రూ.36లక్షలతో ఒక్కొక్క ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించనున్నట్లు, మొత్తం రూ.1.80 కోట్లతో ఐదు ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయనునట్లుగా అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Efforts to increase medical and health services in villages

You cannot copy content of this page

Scroll to Top