త్రినేత్రం న్యూస్, ఎస్.యానం బీచ్ లో 2026 సంక్రాంతి సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు చెప్పారు.
ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయం నందు సూరసేన యానం ఆంధ్ర గోవా కోకో బీచ్ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన బ్రోచర్ ను అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. సంక్రాంతి సంబరాలను ప్రభుత్వ పండుగగా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
పండుగకి వచ్చే అతిధులు అందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పండుగ మూడు రోజులు ఆహ్లాద వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. పార్లమెంటు సభ్యులు హరీష్ మాధుర్ మాట్లాడుతూ ఎస్ యానం సంక్రాంతి సంబరాలను ప్రభుత్వ పండుగ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డి సి ఎం ఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయ వెంకటలక్ష్మి , RDS ప్రసాద్, కంకటల రామం, కడలి వెంకటేశ్వర్రావు, పెచ్చెట్టి విజయలక్ష్మి, గంధం పల్లంరాజు, చిక్కాల గణేష్, బొర్రా వెంకటేశ్వరరావు,చింతా శంకరమూర్తి, బొర్రా వెంకటేశ్వరరావు, యాళ్ళ సతీష్, గండి దేవి హారిక స్వామి, గొల్ల కోటి విజయలక్ష్మి, నాగమానస, కంచిపల్లి అబ్బులు, యెదిడ శ్రీను, కర్రి రామస్వామి, గుత్తుల నాగేశ్వరరావు, నల్లా చిట్టి, నల్లా స్వామి, ఈతకోట నాగేశ్వరరావు, మాడ మాధవి, బొర్రా ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


