MLA Vegulla : నదురుబాదలో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాయవరం మండలం, నదురుబాద గ్రామంలో 571 మంది రైతులకు రాజముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర అంచనాలకమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యల్ని పరిష్కరించటానికి ప్రభుత్వం రీ సర్వే చేపట్టి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పంపిణీ చేసిన పాసు పుస్తకాలను రద్దు చేసి, నిర్ధిష్టమైన సమాచారంతో రాజముద్రను ముద్రించి రైతులకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రైతుల హక్కులను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, భూమి సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వేగుళ్ళ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla distributes new pattadar passbooks

You cannot copy content of this page

Scroll to Top