తేదీ : 03/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. దీపావళి నాటికి మూడు లక్షల గృహప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సాయం అందించి, నిర్మాణాలను వేగవంతం చేస్తారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి లో సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి నెలాఖరు కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


