త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి… ఈరోజు రోడ్డు ప్రమాదాల నియంత్రణ,సురక్షిత ప్రయాణం మరియు వాహనదారుల ప్రాణాల రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “అరైవ్-అలైవ్” పేజ్ -2 కార్యక్రమంలో భాగంగా,పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరిఖని బస్టాండ్ వద్ద గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ఎస్ ఐ రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతపై ఆటో డ్రైవర్స్, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు “అరైవ్-అలైవ్” కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు.ప్రతి వాహనదారుడు ఓవర్ టేకింగ్ చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, లైన్ డిస్ప్లే న్ గురించి, సీట్ బెల్ట్ గురించి, మద్యం సేవించి వాహనం నడపడం పూర్తిగా నివారించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సురక్షిత మరియు జాగ్రత్త డ్రైవింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
అలాగే ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమాలలో సంబంధిత పోలీస్ అధికారులు, ఆటో డ్రైవర్స్ వాహనదారులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


