లారీ ఢీకొనడంతో స్లీపర్ బస్సులో మంటలు..
17 మంది సజీవదహనం
Trinethram News : కర్నాటక రాష్ట్రంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మందికి పైగా సజీవదహనం అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
చిత్రదుర్గ జిల్లా హిరియూర్ సమీపంలోని గోర్లతు గ్రామం వద్ద అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హిరియూర్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ డివైడర్‌ను దాటి రాంగ్‌రూట్‌లోకి వచ్చి బస్సును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఢీకొన్న వెంటనే బస్సు, లారీల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద స్థలాన్ని చిత్రదుర్గ ఎస్పీ రంజిత్ పరిశీలించారు. ఘటనపై హిరియూర్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


