Collector Koya : అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

*ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి… అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఎలిగేడు మండలం బుర్హన్ మియాపేట్ గ్రామానికి చెందిన బి.సదయ్య తాను భూమి లేక కొంతమంది దగ్గర్నుంచి 185,187 సర్వర్ నెంబర్ లో గల 39 గుంటల అసైన్మెంట్ భూమి కొనుగోలు చేశానని, తనయందు దయ తలిచి తన పేరు మీద పట్టా చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎలిగేడు
తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన నంది పుష్పలత శాంతినగర్ ఐటిఐ కాలనీ వీధి రోడ్డుపై ఇదివరకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ చాటు మార్గంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ పెద్దపల్లికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామానికి చెందిన వి.

పైడయ్య, తమ తండ్రి మరణించి మూడు సంవత్సరాలు అవుతుందని, వారి పేరు మీద ఉన్న పట్టా భూమి కి పట్టా పుస్తకం లేనందున జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Applications should be resolved quickly

You cannot copy content of this page

Scroll to Top