Quiz Program : వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో క్విజ్ కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/ చేవెళ్ల నియోజకవర్గం… ఈరోజు వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఫౌండేషన్ వారి సహకారం తో చేవెళ్ల మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జిల్లా స్థాయిలో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని వెలస్పున్ ఫౌండేషన్ సి స్ ర్ హెడ్ కె. సురేఖ గారు ప్రారంభించారు. కార్యక్రమములో GHS చేవెళ్ల హెఛ్ఎం శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, సైన్స్ ఫెయిర్, క్విజ్ లాంటి ఎన్నో మంచి అవకాశాలు కల్పిస్తున్న వెల్స్పన్ ఫౌండేషన్ కు శుభాభినందనలు తెలియశారు.

వెల్స్పన్ ఫౌండేషన్ సురేఖ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులలో పోటీ తత్త్వం, ఆసక్తి, జిజ్ఞాస, గెలవాలనే పట్టుదల పెంపొందించటానికి ఇటువంటి క్విజ్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

క్క్యిజ్ పోటీలలో గెలిచిన తిమ్మారెడ్డి గూడ విద్యార్థులకు మొదటి మరియు తంగడపల్లి విద్యార్థులకు ద్వితీయ, సర్దార్ నగర్ విద్యార్థులకు తృతీయ ఊరేళ్ళ స్కూల్ విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. కార్యక్రమం లో ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లు భద్రయ్య, పవన్ మరియు శిక్షణ ఫౌండేషన్ నుండి రాజు గార్లు విద్యార్థులు, వెల్స్పన్ సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District level quiz program organized by Welspun Foundation

You cannot copy content of this page

Scroll to Top