Trinethram News : పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై నియమించాలని పోలీస్ స్టేషన్కు నూతన భవనం నిర్మించాలని హోం మంత్రి అనితకు టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెనుమూరులో చాలా రోజులుగా ఎస్సై లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని అన్నారు. తరచూ ఈ మార్గంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు.
అలాగే పాత పోలీస్ స్టేషన్ స్థలంలో ( చావడి) భవనం ఉందని తెలిపారు. ఆ స్థానంలోనే నూతన భవన నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు. ఆ సమయంలో స్టేషను తాసిల్దారు కార్యాలయం పక్కన ఉన్న చిన్న భవనం లోకి మార్చారు. చావడి స్థలం 48సెంట్లు ఉందని అందులో 16 సెంట్లు అగ్రికల్చర్ శాఖకు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు దానిని ఓ వైసీపీ నేత ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మొత్తం స్థలాన్ని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నార ని ఆరోపించారు. కావున 48 సెంట్లలో పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం చేపట్టాలని సుధాకర్ రెడ్డి కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


