అల్లూరిజిల్లా అరకులోయ, ఆగస్టు 6 (త్రినేత్రం న్యూస్) : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న విజయవాడలో “చలో విజయవాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయు అల్లూరి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.
అరకులోయలో గిరిజన సంఘం భవనంలో జరిగిన కార్మిక సమావేశంలో, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ – “విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేవు. రూ.46,000 బేసిక్ పే, కోటి రూపాయల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్‌పై రూ.10 లక్షల స్కీమ్ అమలు చేయాలి,” అని డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, ఆదానీకి లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అభి, దాసు, మంగరాజు, అప్పలరాజు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


