
Job Mela : పెద్దపల్లి ,ఆగస్టు -06 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగ యువతీ, యువకుల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో,యూత్ 4 జాబ్స్ ఫౌండేషన్ సహకారంతో ఆగస్టు 12న ప్రత్యేక ఉద్యోగ ఎంపిక శిబిరం (జాబ్ మేళా) నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు రిటైల్, ఐటీ / ఐటీఈఎస్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్, ఈ-కామర్స్ రంగాల్లో ఉద్యోగాల
అందుబాటులో ఉన్నాయని, రిటైల్ అసోసియేట్, సేల్స్ అసోసియేట్, క్యాషియర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ ఎగ్జిక్యూటివ్ / స్టోర్ సూపర్వైజర్, ఇన్వెంటరీ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, బీపీఓ / ప్రాసెస్ అసోసియేట్, హెల్ప్ డెస్క్ ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్, హౌస్ కీపింగ్ అసోసియేట్, ఫుడ్ & బేవరేజ్ సర్వీస్ అసోసియేట్, బ్యాంకింగ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ అసోసియేట్, మెషిన్ ఆపరేటర్, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్, ప్యాకింగ్ అసోసియేట్, వేర్‌హౌస్ అసోసియేట్, పికర్ & ప్యాకర్, డెలివరీ అసోసియేట్, ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, ఆర్డర్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగ హోదాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి సూచించారు.
అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలని, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, శారీరక వైకల్యం, వినికిడి లోపం, స్వల్ప చూపు లోపం ఉన్న దివ్యాంగులు అభ్యర్థులు అర్హులని,
ఉద్యోగ ప్రదేశం హైదరాబాద్ లో ఉంటుందని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా రెజ్యూమ్ సదరం సాధారం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు,విద్యార్హత ధృవీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని ఆగస్టు 12వ తేదిన బుధవారం రోజున ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 8985336947 , 8121262441, 9281408587 , 7330637711 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe