సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Malicious propaganda

అన్ని ఆధారాలు ఉన్నా స్థానిక అభ్యర్థిపై ఆరోపణలు

Malicious Propaganda : డిండి ( గుండ్లపల్లి) ఆగస్టు 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని అంగన్వాడి పోస్ట్ కు గాను 18 మంది అప్లికేషన్స్ పెట్టుకోగా, ఇందులోని ఎనిమిది మందిని ప్రభుత్వం లిస్ట్అవుట్ చేసింది. కాగా కొంతమంది దుర్వినియోగ ఆలోచనలతో స్వార్థ బుద్ధితో సొంత లబ్ధి కోసం స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ఏర్పుల నందిని అనే అర్హురాలైన అభ్యర్థిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక గ్రామానికి చెందిన మహిళలకే ఈ ఉద్యోగంలో అవకాశం కల్పించగా, ఏర్పుల నందిని అనే అభ్యర్థి స్థానికురాలు కాదంటూ కొందరు వ్యక్తులు కలెక్టర్‌కు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ పి.డి నల్గొండ కి ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అధికారిక సర్టిఫికేట్లు ఉన్నా వివాదం:సదరు మహిళ గత నాలుగు సంవత్సరాలుగా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నట్లు రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించి స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) జారీ చేసిన అధికారిక నివాస ధృవీకరణ పత్రం (రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ) కూడా ఆమె వద్ద ఉంది. స్థానికతను నిరూపించేందుకు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ వంటి అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డులు మరియు పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని సదరు అభ్యర్థి తరపు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హులైన వారికి అన్యాయం చేయడమే:కేవలం వ్యక్తిగత ద్వేషాలు లేదా రాజకీయ కారణాలతోనే అర్హురాలైన పేద అభ్యర్థికి దక్కాల్సిన ఉద్యోగాన్ని అడ్డుకోవడానికి ఈ విధమైన కుట్రలు చేస్తున్నారని గ్రామస్తులు అనుకుంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page