ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
ITI ATC Seats

ITI ATC Seats : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 06, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ/ ఏటీసీ) లో వివిధ ట్రేడ్లలో మిగిలి ఉన్న రెండో విడత సీట్ల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.
పదవ తరగతి ఉత్తీర్ణులై 14, సం, లు నిండిన వారు అడ్మిషస్ కోరకు 06-08-26, నుండి 15, -08-26, వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా , ఇంతకు ముందు అప్లై చేసినవారు మరోసారి ఆప్షన్ ఇచ్చుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ స్వామి తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు 4వతరగతి నుండి 10వ తరగతి వరకు బోనాఫైడ్ , కులదృవీకరణ పత్రములు , ఈ మెయిల్ ఐడి , ఫోన్ నెంబర్ , మరియు ఫోటోతో ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ తెలిపారు.

-ముఖ్య గమనిక :–ఆన్లైన్ అప్లై చేసే ముందు ఎస్ఎస్ ఎస్సి మెమో ప్రకారం ఆధార్ కార్డు ఉండాలి మరియు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page