Minister Nadendla Manohar : గిరిజనులకు మైనింగ్ హక్కులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అనంతగిరి, ఆగస్టు 06 (త్రినేత్ర న్యూస్) : అనంతగిరి మండలం వాలసి పంచాయతీకి చెందిన నిమ్మలపాడు, రాళ్లగరువు, కరక వలస గ్రామాల ప్రజలు (ఏపీఎండిసి) ద్వారా కాకుండా తమ గిరిజన సొసైటీకి మైనింగ్ హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, మైనింగ్ శాఖ దృష్టికి తీసుకెళ్లతామని, జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బిర్లా సంస్థ మైనింగ్ ప్రారంభించినపుడు, గ్రామస్తులు సుప్రీం కోర్టు వరకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు. అనంతరం (ఏపీఎండిసి) జోక్యం చేసుకుని మైనింగ్ చేపట్టగా, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అనే నేత వెనకుండారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా అధిక మైనింగ్ చేసి సహజ వనరులను దోచుకున్నా గ్రామాల అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు.
ఈ విషయాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేత, ఇప్పటి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కూడా తెలియజేశామని తెలిపారు. ఇకపై ఏపీఎండిసి వద్ద మైనింగ్ ఉండకూడదని, తమ గిరిజన సొసైటీకి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Request to minister Nadendla Manohar

You cannot copy content of this page

Scroll to Top