
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Ramavath Ravindra Kumar : దేవరకొండ డివిజన్ జులై 12, త్రినేత్రం న్యూస్. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఆసుపత్రి బాధ్యత అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరుద్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నాణ్యమైన సేవలు అందిస్తూ రోగుల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.వైద్య సేవల్లో మానవత్వం, బాధ్యత, సేవాభావం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో ఆరుద్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెంది ప్రజలకు విశ్వసనీయమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామావత్ మోహన్ కృష్ణ,బొంగరాల గణేష్,ఆసుపత్రి యాజమాన్యం, వైద్య సిబ్బంది, అలాగే పలువురు ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe