
Ravindra Kumar : దేవరకొండ డివిజన్ జులై 12, త్రినేత్రం న్యూస్. డిండి మండలం దాసరినెమిలిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ లక్ష్మణ్ వివాహ వేడుకలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
దేవరకొండ పట్టణంలోని శివ సాయి గార్డెన్లో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వివాహానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe