అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Former MLA Visits Vinayaka

Former MLA Visits Vinayaka : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోtని 18వ వార్డులో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడిని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ……గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిభావంతో పాటు సేవా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని, గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్, స్థానిక కౌన్సిలర్ విరమోని అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page