TELANGANA

Ramavat Ravindra Kumar : వీరభద్ర స్వామి అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

-ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి

మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం కమలాపురం జాతర సందర్భంగా వీరభద్ర స్వామి దేవాలయంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు.

దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి,మాజీ మార్కెట్ డైరెక్టర్ కశిరెడ్డి రవీందర్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ రేపని ఇద్దయ్య,చెన్నారం సర్పంచ్ రమావత్ తులిసిరం, స్థానిక ఉప సర్పంచ్ బోదాసు రాములు,నేనావత్ నాగార్జున,కీమా,వాగ్య నాయక్, సుదర్శన్, యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Veerabhadra Swamy should be blessed

You cannot copy content of this page