త్రినేత్రం న్యూస్, జనవరి 20… మండపేట మండలం, వై.సీతానగరం గ్రామంలో మంగళవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పర్యటించారు. ఈ సంధర్బంగా మండపేట, నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేనందుకు ఆ గ్రామ జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ళ ను ఘనంగా సన్మానించారు.
20 రూపాయల నోట్లతో ప్రత్యేకంగా చేయించిన దండను వేసి, కిరీటం అలంకరించి, దుశ్శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపిపి ఉండమట్ల వాసు, గ్రామశాఖ అధ్యక్షులు అయినంపూడి నాగరాజు, మాజీ ఎంపీటీసీ పెనుమత్స వెంకటవర్మ రాజు (రమేష్ రాజు), జనసేన నాయకులు మేడిద భూషణం, మాజీ సర్పంచ్ లు ముదునూరి రంగరాజు, రవ్వా శామ్యూల్ రాజు, ఆచంట రమేష్, మోటూరి మణికంఠ, సొసైటీ మెంబర్ ఇందుకూరి శ్రీనివాసరాజు, నంబూరి రామరాజు, సామిరెడ్డి గోవిందరాజు, నరాల గోవిందు, కోటిపల్లి చక్రవర్తి, ఇందుకూరి వాసు, 1వ వార్డు మెంబర్ సాగిరాజు సురేంద్ర వర్మ, బొక్కా రామకృష్ణ మాచవరపు తలుపులు, తడాల ప్రసాద్, ఆకుల దుర్గా ప్రసాద్, పర్వతిన వీర్రాజు, గొడవర్తి ఎర్రబ్బు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


