Janasena : మాడుగులలో జనసేన కార్యకర్తలతో విశేష సమావేశం

TRINETHRAM NEWS

అనకాపల్లి జిల్లా, త్రినేత్రం న్యూస్ మే 26: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ శ్రేణులు భారీగా సమావేశమయ్యాయి. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి మాడుగుల ఇలవేల్పు మోద మాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి అరకు పార్లమెంట్, పాడేరు నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంచార్జి వంపూరు గంగులయ్య హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనమే పరమావధిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్డీయే కూటమి ఏర్పాటులో కీలకంగా నిలిచాయని, ఇది ఆయన దూరదృష్టిని స్పష్టంగా ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాల్లో ఆయన చూపిస్తున్న నిబద్ధత, సంక్షేమంపై దృష్టి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజలకు చేరువ చేయడంలో కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాడుగుల ఇంచార్జి క్రిష్ణా, చోడవరం ఇంచార్జి PVNS రాజు, నర్సీపట్నం ఇంచార్జి పాటం శెట్టి సూర్య చంద్ర తదితర నేతలు పాల్గొన్నారు. స్థానికంగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special meeting with Janasena

You cannot copy content of this page

Scroll to Top