LPG Cylinder Booking : ఎల్‌పీజీ సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపు

TRINETHRAM NEWS

Trinethram News : ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య ఉన్న బుకింగ్‌ గడువును 21 నుంచి 25 రోజులకు పెంచింది. సిలిండర్లకు కొరత ఏర్పడొచ్చన్న భయాలతో కొందరు ముందస్తుగా గ్యాస్‌ బుక్‌ చేస్తున్నారు.

గతంలో సగటున 55 రోజులకోసారి సిలిండర్‌ బుక్‌ చేసుకునే వాళ్లు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో 15 రోజులకే బుక్‌ చేస్తుండడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో 21 రోజుల లాకిన్‌ నిబంధన తీసుకొచ్చారు. తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచారు.

ఇళ్లలో వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం ఇటీవల రూ.60 భారం మోపింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.5 పెంచింది. మరోవైపు గృహ వినియోగదారుల ఎల్‌పీజీ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, కమర్షియల్‌ వినియోగదారులకంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయిల్‌ రిఫైనరీలకు కేంద్రం సూచించింది.

ఎల్‌పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకొచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచే అవకాశం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతానికి దేశంలో సరిపడా పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ నిల్వలు ఉన్నాయని వెల్లడించాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

LPG cylinder booking period extended

You cannot copy content of this page

Scroll to Top