Birthday Celebrations : తండ్రిని మించిన తనయుడు లోకేష్ బాబు

TRINETHRAM NEWS

మండపేట లో వేగుళ్ళ సమక్షంలో జన్మదిన వేడుకలు

త్రినేత్రం న్యూస్, జనవరి 23, తండ్రిని మించిన తనయుడు గా యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ బాబు అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.

మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మత్స నాగబాబు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత వేగుళ్ళ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఒకప్పుడు తనని విమర్శించిన వాళ్లందరూ నోర్లు వెళ్లబెట్టేలా యువనేత లోకేష్ పరిపాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంత కృషి చేస్తున్నారో లోకేష్ అంతకు మించిన కృషి చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్నారన్నారు.

భావితరాల్లో ఆయన మరింత ప్రత్యేకమైన పాత్ర పోషించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lokesh Babu, a son who surpasses his father

You cannot copy content of this page

Scroll to Top