Birthday Celebrations : ఘనంగా పుట్టినరోజు వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 31/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన వల్లభనేని. గిరిబాబు జన్మదిన వేడుకలు మండలంలో ఉన్నటువంటి కాకతీయ కమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఆ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి. శామ్యూల్ జవహర్, ఆర్గానిక్ చైర్మన్ శా వాలా. దేవదత్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి. ఆశీస్ లాల్, పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు గిరిబాబు, ఆశిష్ లాల్ తో కలిసి ప్రారంభించారు. జవహర్, గిరిబాబుకు భారీ గజమాలవేసి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలకటం జరిగింది. వాళ్లందరూ కూడా ఆయనను నిండు నూరేళ్లు, చల్లగా సంతోషంగా ఇటువంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు. చెరుకూరి. రాజేశ్వరరావు, రేగళ్ల. వీరారెడ్డి, అలవాల. రమేష్ రెడ్డి, నె క్కలపు . వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరికు ఎటువంటి లోటు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Birthday celebrations in grand style

You cannot copy content of this page

Scroll to Top