జూన్ 30, 2026
TRINETHRAM NEWS
Lingamaneni Ramesh Not a position

Lingamaneni Ramesh : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్ : జూన్ 06; జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కూటమి తరుపున తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాన నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ తనకు పదవి కాకుండా బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నట్లు
పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని సామాన్య పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే లక్ష్యమని రమేష్ స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page