PM Modi : ఈ భూమితో భారత్కు రక్త సంబంధం

TRINETHRAM NEWS

Trinethram News : ఇజ్రాయెల్ను ఇండియా అధికారికంగా గుర్తించిన 1950 సెప్టెంబర్ 17నే తానూ పుట్టానని PM మోదీ వెల్లడించారు. ‘ఈ భూమితో భారతదేశానికి ఉన్న సంబంధాన్ని రక్తం, త్యాగాలతో లిఖించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 4 వేల మంది భారత సైనికులు ఈ ప్రాంతంలో తమ ప్రాణాలు అర్పించారు’ అని తెలిపారు. యూదు సమాజాలు ఇండియాలో స్వేచ్ఛగా జీవించాయని చెప్పారు. UNSC ఆమోదించిన గాజా పీస్ ఇనిషియేటివు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు.

మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ సర్ప్రైజ్

ప్రధాని మోదీ పర్యటనలో ఇజ్రాయెల్ PM నెతన్యాహు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. రాత్రి విందుకు ముందు ఆయన భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి మన ప్రధానిని ఆశ్చర్య పరిచారు. ‘నా స్నేహితుడు మోదీ కోసం ఈ డ్రెస్ వేసుకున్నాను’ అంటూ SMలో వీడియో షేర్ చేశారు. అంతకుముందు ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు ఏకతాటిపై ఉన్నాయన్నారు.

గ్లోబల్ లీడర్ గా మోదీ అరుదైన రికార్డు

ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా.. పరస్పరం విరుద్ధమైన దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గ్లోబల్ లీడర్ గా మోదీ నిలిచారు.

తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటులో ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. 2018లో పాలస్తీనా ‘గ్రాండ్ కాలర్’తో సత్కరించింది. గొడవల్లో ఉన్న రెండు దేశాలను మెప్పించి ఇలాంటి గౌరవం పొందడం మోదీ దౌత్యనీతికి నిదర్శనమని విశ్లేషకులు కొనియాడుతున్నారు.

పెద్దన్నను కాదని భారత్కు ఇజ్రాయెల్ సాయం

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్య రాజ్య సమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India has a blood connection with this land

You cannot copy content of this page

Scroll to Top