Sekhar Reddy : ప్రభుత్వ భూమిని కాపాడాలి

TRINETHRAM NEWS

గ్రామ నర్సరీ కోసం సర్వే నెంబర్ 3 లో కజ్జా గురి అవుతున్న ప్రభుత్వ భూమి సేకరించాలి..

తీదేడు గ్రామంలో డంపింగ్ యార్డు,పల్లె ప్రకృతి వనం, పరీశీలించిన గ్రామ సర్పంచ్ . ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి.

చింత పల్లి ఫిబ్రవరి 07, త్రినేత్రం న్యూస్. తీదేడు గ్రామ నర్సరీ కోసం సర్వే నెంబర్ 3 లో కజ్జాకు గురి అవుతున్న ప్రభుత్వ భూమి సేకరించి అందులో నర్సరీ , పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అన్నారు. తీదేడు గ్రామంలోని డంపింగ్ యార్డు, గ్రామ నర్సరీ,పల్లె ప్రకృతి వనాలను యం.పి.డి.ఓ సుజాత తో కలిసి పరిశీలించడం జరిగింది.

గ్రామంలో గ్రామ నర్సరీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని అన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామ అభివృద్ది కోసం గ్రామ నర్సరీలు,పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు నిర్మించారని ఆమె పెర్కోన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ,మర్ల యాదగిరి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల పురుషోత్తం రెడ్డి,వీరమల్ల వెంకటయ్య,ఉడుత శంకరయ్య,వీరమల్ల సత్తయ్య, వలమోని వెంకటయ్య, మునగాల అశోక్, ఏ పి ఓ శౌరి రెడ్డి ,టి.ఏ పకీర,పంచాయతీ కార్యదర్శి అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రయ్య తదితరులున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government land should be protected

You cannot copy content of this page

Scroll to Top