రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య..
కూకట్పల్లి ఫిబ్రవరి 7 (త్రినేత్రం న్యూస్) : ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సతీమణి రమా భాయ్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకొని మూసాపేట్ గూడ్స్షెడ్ రోడ్ అంబేద్కర్ స్టేట్యూ వద్ద ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిధిగా,రాష్ట్ర దళిత నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్కపెంటయ్య విచ్చేసి ఆమె చిత్ర పటానికి ఫూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రమబాయ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను చిన్నపుడే వివాహం చేసుకుంది. అంబేద్కర్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నడానికి కారణం రమబాయ్ అని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ విదేశాలలో చదువుతున్న సమయంలో రమబాయ్ ఎన్నో కష్టాలతో కుటుంబ భారాన్ని మోసింది అని వారు తెలిపారు.మన పిల్లల కోసం తమ పిల్లన్ని పోగుట్టుకున్న త్యాగమూర్తి అని వారు తెలిపారు. ఆమె చేసిన త్యాగాన్ని మనం మరువలేము అని వక్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బి. సి. వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు భాశెట్టి నర్సింగరావు,అంబేద్కర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, కర్క శివశంకర్, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కూతాడి కృష్ణా,హెచ్.ఏ.ల్ గుర్తింపు యూనియన్ జాయింట్ సెక్రటరీ వడ్డే నాగార్జున, అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ అధ్యక్షులు కర్క నిఖిల్, కాంగ్రెస్ నాయకులు చున్ను పాషా,కర్కనర్సయ్య,శారదా,గురజాల రాజు, గురజాల నాగరాజు, పెరుమాండ్ల టింకు ,ఐసీడి కంటైనర్స్ యూనియన్ నాయకులు జగన్, వెంకటేష్,బాషా, అంబేద్కర్ యువజన సంగం మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


